
చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆయనతో సహా అందరూ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని వితండవాదం చేస్తూ కాలక్షేపం చేసేసి దిగిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూ, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలని సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రాజెక్టులు సాధించారు.
రాయలసీమ: ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో డ్రోన్ల తయారీ, మరమత్తులు, శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేపాక్షి హబ్, కొప్పర్తి ఇండస్ట్రియల్ టౌన్ షిప్, కడప-కర్నూలులో గ్రీన్ ఎనర్జీ హబ్ వంటివి చాలా ఏర్పాటు అవుతున్నాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ కంపెనీ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు కాబోతోంది.
Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?
ఉత్తరాంధ్ర: విజయవాడతో పాటు విశాఖలో మెట్రో రైల్ ఏర్పాటుకి నిధులు సమకూర్చుకొని ఈ అక్టోబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వచ్చే ఏడాది జూన్-జూలై నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా, మూలపేటలో పోర్టు ఏర్పాటు కాబోతోంది.
Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి. దాని ఎగుమతి, దిగుమతుల కొరకు సమీపంలోనే మరో రూ.70 వేల కోట్లతో ఓ ప్రైవేట్ పోర్టు నిర్మించబోతోంది.
పూడిమడక వద్ద ఎన్టీపీసీ-ఏపీ జెన్కో కలిసి రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లి వద్ద 200 ఎకరాలలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను తయారుచేసే కేంద్ర ప్రభుత్వం సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఏర్పాటు కాబోతోంది.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి గ్రామం వద్ద 100 ఎకరాలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (నైపర్)అనే మరో కేంద్రప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ రాబోతోంది. ఇంకా గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రాకు తరలి వస్తున్నాయి.
జగన్ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా తరిమేస్తే, సిఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఇన్ని ప్రాజెక్టులు సాధించారు.