
ఇంతకాలం ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది?’ అంటే ఇదీ అని నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉండేది. రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకోవడం ప్రజలు నామోషీగా అవమానంగా భావించేవారు కానీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వైసీపీ నేతలకు కనీసం సిగ్గనిపించలేదు.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
కానీ ఎన్నికలలో ఏపీలో కూటమి విజయం సాధించినప్పుడే అమరావతి రాజధాని అని ప్రకటించేసిన్నట్లయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదట అమరావతి రాజధానిగా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. కనుక రాజధాని విషయంలో ఇప్పుడు జగన్, వైసీపీ నేతలతో సహా ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.
రాబోయే మూడేళ్ళలోనే అమరావతికి రూపురేఖలు తీసుకొస్తామని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, పురాపాలక మంత్రి నారాయణ చెపుతున్నారు. కనుక రాజధాని పూర్తయ్యేలోగానే తాను కూడా అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!
ఆ ప్రకారమే వెలగపూడిలోఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల నుంచి చంద్రబాబు నాయుడు 5 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. సీడ్ యాక్సస్ రోడ్ ఈ-6 పక్కనే ఉందిది. ఇది రాజధాని నడిబొడ్డున ఉన్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉంది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు మొదలవుతాయి.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గత పదేళ్ళుగా కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలో గల లింగమనేని చెందిన అతిధి గృహాన్ని తన నివాసంగా ఉపయోగించుకుంటున్నారు.
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?
జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజావేదికని కూల్చేసిన తర్వాత ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఉంటున్న ఈ నివాసాన్ని కూడా అక్రమ కట్టడం అంటూ కూల్చివేయాలనుకున్నారు. కానీ ధైర్యం చాలక వెనక్కు తగ్గారు.
చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడే అధికారం కోల్పోయారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలవచ్చింది. అప్పుడే ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటికి మారాలని శ్రేయోభిలాషులు చాలా ఒత్తిడి చేశారు కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని గెలవాలే తప్ప వాస్తు, జాతకాలు, గ్రహాలు అంటూ భయపడి పారిపోకూడదని చెప్పేవారు.
ఆయన చెప్పిన్నట్లుగానే అదే ఇంట్లో ఉంటూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ, నిర్భయంగా పోరాడుతూ ఎన్నికలలో తాను గెలిచి కూటమిని కూడా గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నేటికీ అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే తాను కలలు గన్న అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుంటానని ముందు నుంచే చెపుతున్నారు కనుక ఇప్పుడు దానికి సన్నాహాలు ప్రారంభించారు.