బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కీలక చర్చ జరిపారు. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు.
[m9ad]
కోర్టుకు వెళ్లకుండా రీకాల్ పిటిషన్ వేయాలని పలువురు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని మరికొంత మంది సీనియర్ మంత్రులు సూచించారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. చివరికి రీకాల్ పిటిషన్ వేసేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం.
ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్ ను కూడా పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. మరోవైపు రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల తదితర అంశాలపై కూడా చర్చించారు. నిన్న ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రాంతాల్లో అధికార పక్ష నేతలే టార్గెట్ గా ఐటీ డిపార్ట్మెంట్ దాడులు చేసిన సంగతి తెలిసిందే.



