ఈ రోజు తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ, జనసేన పార్టీలు నిర్వహించిన ఉమ్మడి సభ ఇన్నాళ్ల వైసీపీ సిద్ధం సభలకు ఎండ్ కార్డు వేసిందనే చెప్పాలి. ఎలా అయినా ఇరు పార్టీల పొత్తు విచ్ఛిన్నం చేయాలనీ చూస్తున్న వైసీపీ నేతలకు పొత్తు బలమెంతో రుచి చూపించారు ఇరు పార్టీల అధినేతలు.
నారా చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలను ఆలోచింపచేస్తే.., పవన్ తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రజల్లో ఆవేశాన్ని తీసుకు వచ్చారు. సభా వేదిక మీద అందరి ప్రసంగాలు ముగిసిన తరువాత చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడకి వచ్చిన ప్రజలందరినీ చూస్తుంటే ఈసారి వైసీపీ ఓటమి, టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయంగా కనపడుతుంది అంటూ సభను ముగించారు.
ఇక సభ ముగిసింది…ఇక మనపై విమర్శల వర్షం ఆగింది అనుకున్న వైసీపీ నాయకులకు పవన్, బాబు ఇద్దరు ఆలింగనం చేసుకుని, చేయి చేయి కలుపుకుని ఫోటోలకు ఫోజులిచ్చి ఇరు పార్టీల క్యాడర్ కు పొత్తును మరికొంత బలంగా ముందుకు తీసుకువెళ్లారు. దీనితో ఇక పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ వేస్తున్న ఎత్తులు పారవని, ఇక వారి ‘చొక్కాలు వారే మడతపెట్టుకుంటే మంచిదనే’ సంకేతాన్ని ఇచ్చారు బాబు, పవన్ లు.
అలాగే నందమూరి బాలకృష్ణ ప్రసంగాన్ని మొదలు పెట్టే సమయంలో కూడా పవన్ ఆయన దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా విష్ చేసారు. దానికి బాలయ్య కూడా థాంక్యూ బ్రదర్ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. జై తెలుగు దేశం, జై జనసేన అంటూ రెండు పార్టీల కండువాలను తన మేడలో వేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఈ పరిణామాలతో ఇరు పార్టీల పై స్థాయిలో పొత్తు ఎంత బలంగా ఉందో ఇరు పార్టీల కింద స్థాయి నేతల నుంచి వైసీపీ కుటుంబానికి కూడా అర్ధమయ్యింది.
అయితే బాబు గురించి పవన్ చేసిన ప్రసంగంతో బాబు అభిమానుల రోమాలు నిక్కబొడిచాయనే చెప్పాలి. అలాగే రాష్ట్రం కోసం, పొత్తు కోసం పవన్ వేసిన ముందడుగు ను కొనియాడి జనసైనికులను తన వైపు ఆకర్షించుకున్నారు బాబు. దీనితో పవన్, బాబులో ఈ యాంగిల్ చూసిన టీడీపీ – జనసేన నాయకులలో, కార్యకర్తలలో జోష్, వైసీపీ లో కుళ్ళు ఒకేసారి రాజేశారు రెండు పార్టీల అధినాయకత్వం.
Photos: TDP-Janasena Mega Meeting Highlights





