ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!

Chandrababu naidu planning to cut down power chargesవిద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కరెంటు చార్జీలను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం నాడు అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడుతూ… గతంలో ఏప్రియల్ వచ్చిందంటే కరెంటు చార్జీలు ఎక్కడ పెరుగుతాయోనని ప్రజలు భయంగా ఎదురుచూసేవారని, కానీ వచ్చే ఏడాది నుంచి ఏ మేరకు తగ్గుతాయోనని ఆశగా ఎదురు చూసే పరిస్థితి రావాలని అన్నారు.

ADVERTISEMENT

1998లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన తొలి దశ విద్యుత్ సంస్కరణల ఫలితాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయన్నారు. అప్పటి సంస్కరణల వల్లే నేడు మిగులు విద్యుత్ సాధించే స్థాయికి చేరుకున్నామని, వ్యయ నియంత్రణ విధానాలను అమలు చేయడం ద్వారా ఏటా 2 వేల కోట్ల మేర పొదుపు చేసుకోవచ్చని వివరించారు. తమ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో మెగా విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT
Latest Stories