Chandrababu Naidu-Sajjala-Ramakrishnaచంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా అక్కడ జరిగిన విద్వాంసాన్ని సమర్ధించుకుంటూ, ఆ విద్వాంస కాండ మొత్తానికి ప్రతిపక్ష పార్టీయే కారణం అంటూ ఆంధ్రప్రదేశ్ సకల శాఖ మంత్రి సజ్జల వివరణ ఇచ్చేప్రయత్నం చేశారు. అయితే అందులో భాగంగానే సంక్షేమం…, బటన్ నొక్కడం మా పార్టీ ట్రేడ్ మార్క్ రాజకీయం అంటూ చెప్పుకొచ్చారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బు జమ చేయడానికేనా మీకు 151 సీట్లు ఇచ్చింది అంటూ ప్రతిపక్షాలు అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నాయి.

సంక్షేమ పేరుతో సంక్షోభం.., పధకాల పేరుతో పైశాచికాలు.., అభివృద్ధి పేరుతో అక్రమాలు.., మార్ఫింగ్ల పేరుతో అశ్లీలతలు చేయడమే వైసీపీ పార్టీ ట్రేడ్ మార్క్ రాజకీయాలు అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. తమను విమర్శిస్తే సొంత పార్టీనేతనైనా తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా చేయడం ఈ అధికార పార్టీకి పరిపాటిగా మారిందంటూ రఘు రామ రాజు వైనాన్ని గుర్తుచేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

అప్పుడు నర్సాపురం పర్యటనకు గాను రఘురామా రాజుని .., ఇప్పుడు కుప్పం పర్యటనకు గాను బాబుని ఇలా ఒక్కొక్కరిగా మొదలై రేపటిరోజున ఇదే పరిస్థితి రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం లేకపోలేదు అంటూ చంద్రబాబు రాజకీయ పార్టీ నేతలను.., ప్రజలను హెచ్చరించారు. ఇంతటి అహంకార పూరిత రాజకీయాలు చేయడం వలన ప్రజలకు జరిగే మేలు ఏంటో సజ్జల గారే చెప్పాలి అంటున్నారు టీడీపీ శ్రేణులు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే….., రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో తెలిసింది అన్న చందంగా సజ్జల మాట్లాడే తీరు చూసి విపక్షాలతో పాటు సామాన్యుడు కూడా విస్తు పోతున్నారు. కిలో బియ్యం 2రూపాయలకే అంటూ ఎన్టీఆర్ తీసుకువచ్చిన వినూత్న మార్పు గాని…,ఆడపిల్లకు ఆస్తిలో హక్కుని కలిపించిన వైనాన్ని కానీ., చంద్రబాబు నూతన రూపకల్పన అయినా డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళా సాధికారత పెంచిన విధానాన్ని కానీ గుర్తుచేసుకోవాలంటూ సజ్జలకు హితవు పలుకుతున్నారు ప్రతిపక్షనేతలు.

వైస్సార్ ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ., ఫీజ్ రీబర్స్ మెంట్ పథకాలు గాని., రైతులకు ఉచిత కరెంట్ హామీలు కానీ.., రాష్ట్ర విభజన తరువాత రెండు వందలున్న పెన్సషన్ ను ఒక్కసారిగా వెయ్యి చేసి దానిని రెండు వేలకు పెంచి .., నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పించడం., 5రూ. భోజనం పెట్టె అన్న కాంటీన్లను స్థాపించడం..,పేదలకు ఇళ్ళు నిర్మించడం ఇలా ఎవరి హయాంలో వారు పేదవారికి చేయూతను అందిస్తూనే వచ్చారు.

కానీ సజ్జల మాత్రం పవన్ చేసిన “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్” ని రాష్ట్ర ప్రజలకు అందించడమే జనసేన లక్ష్యం అంటూ అందుకోసం జనసేన ఏపార్టీతో అయినా పొత్తులకు సిద్దమవుతునంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమి అందవంటూ వ్యాఖ్యానించడం జనసేన నేతలకు ఆగ్రహాన్ని తీసుకువచ్చింది.

పాత కుండలో కొత్త మట్టి పోసి మొక్క నాటి ఇది నా కుండే అన్న చందంగా….పాత పధకాల పేర్లు మార్చి.., సొంత నేతల స్టికర్ లతో బ్రాండింగ్ చేసుకుంటు.,పన్నుల రూపములో ప్రజల నుండి వచ్చిన మొత్తాన్ని బటన్ నొక్కడం ద్వారా పంచుతూ అదేదో తమ సొంత జేబులో డబ్బులు పంచిన మాదిరి ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం.., తమ సొంత తయారీ మద్యాలు అమ్ముకుంటున్న మీరు ….,ప్రజల సంక్షేమం గురించి మాట్లాడం చూస్తుంటే ప్రజలకు వైసీపీ పార్టీనేతల మీద జుగుప్స కలుగుతుంది అంటూ సజ్జలకు బాగానే బదులిచ్చారు విపక్షాలు.

కూల్చడం…, అక్రమ కేసులు పెట్టడం.., విద్వేషాలు రెచ్చకొట్టడం.., రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం.., దోచుకోవడం – దాచుకోవడం ఇవే మీ పార్టీ పేటెంట్ రైట్స్ విపక్ష పార్టీలు వైసీపీ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. సజ్జల గారు ఇప్పుడైనా గమ్మునుంటారో మల్లి తమకలవాటైన ఎదురుదాడితో ముందుకొస్తారో..!