చంద్రబాబుకు మిగతా దక్షిణాది పార్టీ ఇస్తున్న గౌరవాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయా?

Chandrababu Naidu South India Political Parties Supportనిన్న కర్ణాటకలో జేడీఎస్ కోసం ప్రచారం చేసిన చంద్రబాబు ఈ రోజు తమిళనాడులో డీఎంకే కోసం ప్రచారం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడుకు ఇస్తున్న ప్రాముఖ్యతను బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ వారికీ, తెరాస వారికీ కంటగింపుగా మారినట్టు ఉంది. చంద్రబాబును పిలవకుండానే వెళ్ళి ప్రచారం చేసి వస్తున్నారని వారు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపచేస్తున్నారు. ఏకంగా వారు ప్రచారంలో ఉంటే చంద్రబాబు వెళ్లి డిస్టర్బ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నిన్న కర్ణాటకలో ప్రచారం చేసిన చంద్రబాబు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఉన్నారు. ఆయన తన అధికారిక కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని చంద్రబాబుతోనే ఉన్నారు. మరోవైపు అటు జగన్ మోహన్ రెడ్డిని కానీ, కేసీఆర్ ని కానీ ప్రచారానికి పిలిచే వారే లేరని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు మీద ఉన్న అక్కసుతోనే ఈ ప్రచారానికి పూనుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వర్గాలే చంద్రబాబు కర్ణాటక వెళ్లి తెలుగు ఆడబడుచు సుమలతను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా బాధ పడిపోతున్నారు.

ADVERTISEMENT

“నంద్యాల ఉపఎన్నికలలో తల్లితండ్రులను ఇద్దరినీ పోగొట్టుకున్న భూమా అఖిలప్రియను అభ్యర్థిగా టీడీపీ నిలబెడితే, వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ ఎందుకు పెట్టింది? పైగా జగన్ స్వయంగా అక్కడ పది రోజులు ప్రచారం చేసి ఆమెను ఓడించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు చెబుతున్న నీతులు అప్పుడు ఏమయ్యాయి? సుమలత గెలిచాకా బీజేపీలో చేరడమో మద్దతు ఇవ్వడమో జరగుతుంది. దీనికోసమే బీజేపీ వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు,” అని బీజేపీ వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories