ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి!

Chandrababu-Naiduఅమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ నెట్‌వర్క్ (జీ-టెన్) సభ్యులతో, ఐటీ సంస్థల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… జాబ్ ఉంది కదా అని సరిపెట్టుకోవద్దని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రలో వచ్చే 12 నెలల్లో 500 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమన్నారు.

షికాగోలో మిమ్మల్ని చూస్తుంటే తాను హైదరాబాద్‌లో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా? అన్న సందేహం కలుగుతోందన్నారు. 20 ఏళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయని, ఐటీలో మన వాళ్ల హవా కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇక అమెరికాలో ఎక్కడ చూసినా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయన్నారు.

ADVERTISEMENT

జన్మభూమి రుణం తీర్చుకునేందుకు పుట్టిన గడ్డకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని చంద్రబాబు కోరారు. అలాగే మిమ్మల్ని ఆదరించి, ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను కూడా మర్చిపోవద్దన్నారు. అనంతరం అక్కడి నుంచి తన బృందంతో కలిసి చంద్రబాబు డిమోయిన్స్ చేరుకుని వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్‌ను సందర్శించారు. తానా ప్రతినిధులు చంద్రబాబును కలిసి అమరావతిలో 20 లక్షల డాలర్లతో తానా భవన్ నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.

ADVERTISEMENT
Latest Stories