డేంజర్ లో చెన్నై మెరీనా బీచ్… జనాలు భరించలేని దుర్వాసన..!

Chennai Marina beach Cargo Ship Pollutes Shoreచెన్నైలోని మెరీనా బీచ్ కు పెనుముప్పు వాటిల్లింది. నాలుగు రోజుల క్రితం చెన్నై సముద్ర తీరంలో రెండు కార్గో ఓడలు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల ఓడల్లోని చమురు పెద్ద ఎత్తున సముద్రంలోకి లీక్ అయింది. మొన్నటి వరకు ఎన్నూరు తీరానికి కొట్టుకు వచ్చిన ఈ చమురు తెట్ట… సోమవారం నాడు మెరీనా తీరాన్ని తాకింది. దీంతో బీచ్ పొడవునా నలుపు రంగులో చమురు తెట్లు దర్శనమిస్తున్నాయి.

బీచ్ లోని ఇసుక తెన్నెలపై కూడా అక్కడక్కక కనిపిస్తోంది. దీంతో బీచ్ మొత్తం భరించలేనంత దుర్వాసన కొడుతోంది. బీచ్ కు వచ్చిన సందర్శకులు, ప్రజలు ఈ దుర్వాసనను తట్టుకోలేక ముక్కులు మూసుకుంటూ, మళ్ళీ తిరుగు పయనం అవుతున్నారు. మరోవైపు ఈ చమురు తెట్టు వల్ల సముద్రంలోని అనేక జలచరాలు ప్రాణాలు కోల్పోయి, చనిపోయిన చేపలు, తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories