ఇండస్ట్రీలో నేను ‘భజన బ్యాచ్’లో లేను!

Chinni Krishna, Chinni Krishna Chiranjeevi, Chinni Krishna Chiranjeevi 150 Movie, Chinni Krishna Comments Chiranjeevi Movie, Chinni Krishna Ram Charan Movieసినీ పరిశ్రమలో ‘భజన బ్యాచ్’ ఎక్కువన్న విషయం బహిరంగ సత్యమే. ఈ భజనతోనే చాలామంది ‘షెడ్’కు వెళ్లిపోయారని ఒక ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు వ్యక్తపరిచిన సందర్భం ఉంది. అలాంటి కీలక పాత్ర పోషించే ‘భజన బ్యాచ్’పై ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. తానూ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే గానీ, ఆ ‘భజన బ్యాచ్’ వ్యక్తిని కాదని, అందుకే తన ప్రతిభతో సంబంధం లేకుండా అవకాశాలు చాలా అరుదుగా లభిస్తుంటాయని కీలక వ్యాఖ్యలు చేసారు.

ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన చిన్ని కృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి 150వ సినిమాపై స్పందిస్తూ… అది కేవలం తమిళ హిట్ కు ఒక జిరాక్స్ కాపీగా అభివర్ణించారు. ఈ సినిమా కోసం ఒక కధను వినిపించినప్పటికీ చిరు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో చిన్ని కృష్ణకు చేదు అనుభవమే ఎదురయ్యింది. అలాగే గతంలో రామ్ చరణ్ ఎంట్రీ కోసం కూడా ఒక కధను సిద్ధం చేయగా, అప్పటికి ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పూరీ జగన్నాధ్ వైపుకు చిరు మళ్ళారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ADVERTISEMENT

సంక్రాంతికి రాబోయే మెగాస్టార్ 150వ సినిమా, నందమూరి నటసింహం 100వ సినిమాల మధ్య పోటీ గురించి పెద్దగా స్పందించని చిన్ని, తన ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించడం లేదని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఒకటి, రెండు సందర్భాలలో కూడా చిన్ని కృష్ణ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవికి ‘ఇంద్ర,’ బాలకృష్ణకు ‘నరసింహనాయుడు’ వంటి ఆల్ టైం రికార్డులు సృష్టించిన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చిన్ని, చివరగా అల్లు అర్జున్ కు ‘బద్రినాద్’ కధను అందించి మెగా అభిమానులను నిరాశపరిచారు.

ADVERTISEMENT
Latest Stories