మెగాస్టార్ చిరంజీవి రెండో తనయురాలు శ్రీజ వివాహం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగడంతో… ప్రస్తుతం శ్రీజ వివాహానికి సంబంధించిన మొక్కులు తీర్చుకునే కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీజ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీజ దంపతులతో పాటు, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనలు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. “తన కూతురి వివాహం జరిగితే స్వామి వారి దర్శనం చేసుకుంటాననే మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లుగా” చిరంజీవి స్పష్టం చేసారు. చిరంజీవి కుటుంబానికి తీర్ధప్రసాదాలతో అర్చకులు ఆశీర్వచనం చేసారు.