అజ్ఞాతవాసికి చిరు ఆశీర్వాదం!

Chiranjeevi Chief Guest for Agnyaathavaasi Audio Launchపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ నెల 19న హైదరాబాద్ లోని నోవోటెల్ లో ఈ కార్యక్రమం జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ పాటల వేడుకకు ముఖ్యఅతిధిగా రాబోతున్నారట. దీనితో మెగా అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT

16న ఈ చిత్రం మొదటి టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. జనవరి 10, 2018 రోజున సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపుగా 130 కోట్ల బిజినెస్ నడుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినందువల్ల సినిమా టిక్కెట్ రేట్లు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయట. మరోవైపు చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల మూడవ వారంలో సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి.

ADVERTISEMENT
Latest Stories