“ఓం నమో వేంకటేశాయ” సినిమాపై చిరంజీవి కామెంట్స్!

chiranjeevi comments on Om Namo Venkatesaya movieభక్తిరస చిత్రాలను అత్యద్భుతంగా చిత్రీకరించడంలో సిద్ధహస్తుడైన రాఘవేంద్రరావు దర్శకత్వంలో కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నిర్మాణం జరుపుకున్న “ఓం నమో వేంకటేశాయ” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పలువురి సినీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రీమియర్ షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా విచ్చేసారు. సినిమాను వీక్షించిన అనంతరం తన అభిప్రాయాలను వ్యక్తపరిచిన చిరంజీవి, చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

ADVERTISEMENT

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భక్తి ప్రవృత్తులు పెల్లుబూకుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా చూడడం ఒక గొప్ప అనుభూతి అని, ముఖ్యంగా సెకండాఫ్ వచ్చేసరికి చాలా హృద్యంగా ఉండడంతో పాటు కళ్ళు చెమర్చేలా చిత్రం ఉందని కొనియాడారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి క్రిందకు రావడం దగ్గర నుండి, భక్తుడు కళ్యాణం జరిపించడం వరకు అత్యద్భుతంగా ఉంది. ఇదొక డివోషనల్ ట్రావెల్ లాంటిదని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు.

ఇంత చక్కటి సినిమా తీయాలి అంటే ఒక్క రాఘవేంద్రరావు వలనేనని, చేయాలి అంటే మిత్రుడు నాగార్జున ఒక్కడి వల్ల అవుతుందని, అలాగే నిర్మించాలన్నా నిర్మాత మహేష్ లాంటి వ్యక్తుల వలనే సాధ్యమవుతుందని అన్నారు. ‘అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి’ వంటి చిత్రాలకు తగ్గకుండా ఈ సినిమా ఉందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూడడం అనేది ఒక దివ్యానుభూతి అని చిరంజీవి ప్రశంసలు కురిపించడంతో, వెనుక ఉన్న కింగ్ పొంగిపోయారు.

ADVERTISEMENT
Latest Stories