వావ్… చిరు గుమ్మడికాయ… వినాయక్ నెత్తిన బిందె..!

Chiranjeevi Directed VV Vinayak Scenesమెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం ఆసన్నమైంది. గత ఎనిమిది సంవత్సరాలుగా కేవలం మాటల వరకే పరిమితమైన మెగాస్టార్ 150వ సినిమా, ఇక కార్యరూపం దాల్చుకోదని మెగా అభిమానులు మానసికంగా సిద్ధమైన తరుణంలో… దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో… మెగాస్టార్ చిరంజీవికి కావలసినంత ఖాళీ సమయం లభించడంతో… వినాయక్ దర్శకత్వంలో ఓ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి వెళ్లారు.

అయితే మధ్యలో షూటింగ్ గ్యాప్ లు రావడంతో… ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అని మదనపడ్డ మెగా ఫ్యాన్స్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. అవును… “ఖైదీ నంబర్ 150” చివరి షాట్ కు మెగాస్టార్ దర్శకత్వం వహిస్తూ… ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ‘ఠాగూర్’ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ దర్శకుడు వివి వినాయక్ ఓ చిన్న పాత్రలో నటించగా, ఈ షాట్ కు మెగాస్టార్ దర్శకత్వం వహించారు. ఈ షాట్ తో సినిమా షూటింగ్ మొత్తం ముగిసిపోయింది.

ADVERTISEMENT

ఇక, మిగిలినదంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. దాదాపు విడుదలకు ఇంకా నెల సమయం ఉండడంతో తాపీగా ఈ పనిని కూడా పూర్తి చేసి అనుకున్న సమయానికి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కు ఉత్సాహమిచ్చే మరో విషయం ఏమిటంటే… ఈ నెల 25వ తేదీన విజయవాడలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు ప్రత్యేక అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నారని, స్వయంగా పవన్ ఈ ఆడియో సిడిని విడుదల చేసి మెగాస్టార్ కు ఇస్తారన్న ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ‘ధృవ’ సినిమా ఫలితంలో హ్యాపీగా ఉన్న మెగా ఫ్యాన్స్ కు రాబోయేదంతా మంచి కాలమేలా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories