రాజకీయాల్లోకి రాక ముందు వరకు ‘సేవా’ పరంగా మెగాస్టార్ చిరంజీవికున్న ఇమేజ్ తెలియనిది కాదు. తన ట్రస్ట్ ద్వారా డబ్బులు తీసుకుని రక్తాన్ని సరఫరా చేసినా గానీ, ప్రజల్లో ఈ రకమైన అవగాహన రావడానికి ప్రధాన కారణం మాత్రం అప్పట్లో చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు అన్నది అందరూ అంగీకరించే విషయం.
అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు చేసిన సేవలకు కూడా మచ్చ రాగా, అప్పటినుండి చిరంజీవి ‘సహాయం, సేవ’ అన్న పదాలు మరిచిపోయారంటూ అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ పేలిన పంచ్ లకు కొదవలేదు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాలను మాత్రమే చేసుకుంటున్న మెగాస్టార్, మళ్ళీ బ్యాక్ టు ఫాం అన్న రీతిలో ఇండస్ట్రీలో వారికి సహాయం చేస్తున్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న గుండు హనుమంతరావుకు మరియు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పొట్టి వీరయ్యకు చెరొక రెండు లక్షల చొప్పున చెక్ లను అందజేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఈ రెండు సందర్భాలలోనూ చిరు లేరు గానీ ,తన చెక్ లను ‘మా’ అసోసియేషన్ కు పంపించి ఇవ్వడంతో, మెగాస్టార్ పేరు మాత్రం బయటకు వచ్చింది.



