“కత్తిలాంటోడు” షూటింగ్ – ‘డే 1’ ఏం జరిగింది?

Chiranjeevi, Katthilantodu, working stills, Chiranjeevi 150th movie, VV Vinayakమెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అన్ని అడ్డంకులను దాటుకుని మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. మొదటి రోజు షూటింగ్ ను ఒక పండుగలా జరుపుకుంది చిత్ర యూనిట్. అల్లు అరవింద్, వరుణ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరై తొలి రోజు షూటింగ్ ను వీక్షించగా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, కళా దర్శకుడు తోటతరణి వంటి ప్రముఖల నడుమ కేక్ కట్ చేసి దర్శకుడు వినాయక్ కు తినిపించారు మెగాస్టార్.

ADVERTISEMENT

ఇక, సన్నివేశాల చిత్రీకరణ విషయానికి వస్తే… రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి – కమెడియన్ అలీల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సింపుల్ కాస్ట్యూమ్స్ ధరించి లైట్ గడ్డంతో ఉన్న మెగాస్టార్ చిరు లుక్ ఫ్యాన్స్ కు కిక్ ను పంచుతుండగా, ఓ కాషాయి రంగు టీ షర్టుతో అలీ చేస్తున్న కామెడీని వినాయక్ అలా చూస్తూ ఉండిపోయిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

నిర్విరామంగా జరగనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కావాల్సి ఉంది. చాలా మంది తారల పేర్లు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు ఎవ్వరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో హీరోయిన్ లేకుండానే ‘కత్తిలాంటోడు’ సెట్స్ పైకి వెళ్ళిపోయాడు. బహుశా మరికొద్ది రోజుల్లో హీరోయిన్ ఎంపికపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories