తరువాతి బిగ్ బాస్ హోస్టు చిరంజీవేనా?

Chiranjeevi's Incomplete Passion Towards Sye Raaబిగ్ బాస్ మూడవ సీజన్ పూర్తి అయ్యింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖిని వెనక్కి నెట్టిన రాహుల్ గెలిచి యాభై లక్షల ప్రైజ్ మనీ చెక్ తీసుకెళ్లాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

అయితే గ్రాండ్ ఫినాలే కాస్తా మెగాస్టార్ వన్ మ్యాన్ షోగా అయిపోయింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ తో అందరిని అలరించారు. అప్పటి నుండి బిగ్ బాస్ తరువాతి సీజన్ హోస్టుగా చిరంజీవే ఉండబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అభిమానులు కూడా చిరంజీవి అయితే షోలో రూఫ్ ఆడించేస్తారు అని అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

ఒకవేళ అదే జరిగితే బిగ్ బాస్ కు వరుసగా నాలుగు సీజన్లకు నలుగురు వేరువేరు హోస్టులు ఉన్నట్టుగా అవుతుంది. ఇప్పటివరకు మూడు సీజన్లకు ఎన్టీఆర్, నాని, నాగార్జునలు హోస్టులుగా పని చేశారు. మధ్యలో నానికి కొంత బ్యాడ్ నేమ్ వ్ వచ్చినా నాగార్జునకు ఈ సీజన్ కు మంచి మార్కులే పడ్డాయి.

ఈ తరుణంలో నాగార్జునను షో నుండి సాగనంపుతారా అనేది చూడాలి. తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్ వరుసగా అన్ని సీజన్లకు హోస్టుగా పనిచేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు తో టీవీ రంగంలోకి అరంగేట్రం చేశారు. అయితే అప్పట్లో ఆయనకు ఆ షోకి మంచి మార్కులు పడలేదు.

ADVERTISEMENT
Latest Stories