‘పవన్ కళ్యాణ్’పై స్వరం పెంచిన ‘చిరంజీవి’

Chiranjeevi On Pawan Kalyan Politicsఎప్పుడు ఏ మెగా వేడుక జరిగినా… ఒక్క విషయం మాత్రం హాట్ టాపిక్ గానే మారుతోంది. అదే పవన్ కళ్యాణ్ హాజరు. అయితే దీనికిక మెగా కాంపౌండ్ చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది. ఇప్పటికే నాగబాబు, అల్లు అర్జున్ ల ద్వారా వివిధ సందర్భాలలో పవన్ అభిమానులను టార్గెట్ చేసుకుంటూ వచ్చిన మెగాస్టార్ వర్గం నుండి, ఇక నేరుగా కౌంటర్స్ ఎదురు కాబోతున్నాయన్న సంకేతాలు వచ్చేసాయి.

ముఖ్యంగా పవన్ విషయంలో ఇప్పటివరకు సైలెంట్ వహించిన చిరంజీవి కూడా పెదవి విప్పడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. “ప్రతి ఫంక్షన్ కు పవన్ రావాలా? రాకపోతే అది నేరమా” అంటూ తీవ్రంగా స్పందించడంతో పవన్ హాజరు అంశం అనేది మెగాస్టార్ కు కూడా కాసింత విరక్తి తెప్పించినట్లుగా కనపడుతోంది. ఎలాంటి సందర్భంలో అయినా తడబడకుండా మాట్లాడే చిరు నోటి వెంట ప్రస్తుతం కౌంటర్స్ రావడం వెనుక ‘ఖైదీ నంబర్ 150’ ఇచ్చిన సక్సెస్ కారణమంటున్నారు ట్రేడ్ వర్గీయులు.

ADVERTISEMENT

“ఖైదీ నంబర్ 150”కి వస్తున్న కలెక్షన్స్ తో అభిమానులతో సహా టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు కూడా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ చిరు రేంజ్ ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో మెగాస్టార్ వైఖరి కాస్త మారినట్లుగా కనపడుతోంది. ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మపై స్తబ్దుగా ఉన్న చిరు, తాజాగా వర్మను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం, అది ముగియక ముందే పవన్ గైర్హాజరును సమర్ధించడంతో… రాజకీయ రంగంలో పనిచేయని ‘స్వరం,’ ప్రస్తుతం దూకుడు మీదున్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories