విన్నారా… ‘సైరా’ రిలీజ్ టైం అంట…!

Chiranjeevi-SYE-RAA-NARASIMHA-REDDY-Release in 2019 Pongaమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన “సైరా నరసింహారెడ్డి” సినిమా షూటింగ్ డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపిక జరుగుతుండగా, మరో పక్కన ఇప్పటికే ఎంపిక చేసిన సాంకేతిక నిపుణుల పేర్లల్లో మార్పుచేర్పులు వస్తున్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సంకల్పించుకుంది.

ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం అయితే… సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది సమ్మర్ నాటికి విడుదల చేయాలని భావించారు. మెగాస్టార్ చిరు కూడా స్వయంగా విడుదలపై ఓ ప్రకటన చేసారు. అయితే సమ్మర్ విడుదల సాధ్యం కాదు అన్న విషయం స్పష్టమైంది. సమ్మర్ నుండి వెనక్కి జరిగిన ఈ సినిమా విడుదల 2018లో ఉండకపోవచ్చు అనేది లేటెస్ట్ అండ్ హాట్ న్యూస్.

ADVERTISEMENT

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో ‘బాహుబలి’లా మెరిసిపోవాలని తీర్చిదిద్దుతోన్న ఈ ప్రాజెక్ట్ ను 2019 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా లేటెస్ట్ న్యూస్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా లెక్కింపు లేకుండా ఎంత అయితే అంత పెడతామని చెర్రీ చెప్పిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories