చిరంజీవి ‘వాయిస్ ఓవర్’తో రానుంది!

Chiranjeevi Voice over for the ghazi movie‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఖైదీ నంబర్ 150’ ద్వారా బాక్సాఫీస్ వద్ద మెగా సందడి చేసిన చిరంజీవికున్న క్రేజ్ ఏమిటో ట్రేడ్ వర్గాలకు తెలిసి వచ్చింది. ఈ క్రేజ్ కు ఏకంగా 100 కోట్లతో స్వాగతం పలికారు సినీ ప్రేక్షకులు. ఈ ఉత్సాహాన్ని ఇలా కొనసాగించేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న మెగాస్టార్, త్వరలోనే తన ‘గాత్రదానం’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇండియన్ ఫస్ట్ సబ్ మెరైన్ మూవీగా ఎంతో ప్రాధాన్యతను దక్కించుకున్న “ఘాజీ” సినిమా తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ‘వాయిస్ ఓవర్’ ఇవ్వబోతున్నారు. హిందీలో ఇప్పటికే ది గ్రేట్ అమితాబ్ గాత్రదానం చేయగా, తెలుగు భాషకు వచ్చేసరికి మెగాస్టార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే తమిళ వర్షన్ లో హీరో సూర్య చిరు విధులను నిర్వహించనున్నాడు.

ADVERTISEMENT

ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రానా హీరోగా నటించగా, పీవీపీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. గతంలో ‘జై హనుమాన్’ సినిమాకు కూడా చిరు తన స్వరం వినిపించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories