chiranjeevi-next-movie

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను తమ వైపు ఆకర్షించుకుంటున్న సినిమాలు ఎక్కువగా బ్లడ్ బాత్ వైలెన్స్ తో నిండిపోతున్నాయి. ఈ ట్రెండ్ కు ఒక రకంగా నాంది పలికింది కెజిఎఫ్ మూవీ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి.

ఆ తరువాత వచ్చిన సలార్, సందీప్ వంగా యానిమల్, ఎన్టీఆర్ దేవర కూడా ఇదే తరహా కంటెంట్ తో ప్రేక్షుల నీరాజనాలు అందుకుంది. ఇక పవన్ అభిమానులు అత్యంత ఆత్రుత గా ఎదురుచూస్తున్న OG మూవీ కూడా పూర్తిగా బ్లడ్ బాత్ మూవీ అనేది OG గ్లిమ్స్ తో స్పష్టమయింది.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

గత కోనేళ్ళుగా పవన్ నుంచి ఆయన అభిమానులు కానీ సాధారణ ప్రేక్షకులు కానీ ఆశిస్తున్న మూవీ ఇలాంటిదే అనేలా OG తన గ్లిమ్స్ తోనే సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు అనే పవన్ కూడా ఈసారికి ట్రెండ్ ఫాలో అవ్వక తప్పలేదు.

ఇక తమ్ముడే ట్రెండ్ కి తగ్గట్టే తన సినిమాలను ఎంపిక చేసుకుంటే అన్న మెగాస్టార్ తగ్గుతాడా.? చిరు రీ ఎంట్రీ తరువాత వచ్చిన సినిమాలు కేవలం మెగా అభిమానులను మాత్రమే సంతోష పెట్టేలా ఉన్నాయి కానీ ఒక సాధారణ సినీ అభిమానిని మెప్పించలేకపోతున్నాయి.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

ఒక పక్క డబ్బింగ్ కథలతో, మరో పక్క వింటేజ్ చిరు అంటూ మూస కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరు. అయితే మెగాస్టార్ తరువాత మూవీ ఇదే అంటూ నాని తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానులనే కాదు సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది.

చేతి నిండా రక్తం కారుతూ ఉన్న పోస్టర్ ను చూపిస్తూ “హింసలోనే అతడు శాంతిని వెతుక్కుంటాడు” అనే టాగ్ లైన్ ఇస్తూ నాని ఈ పోస్టర్ ను పోస్ట్ చేసారు. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందాను, ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డాను, చివరికి ఇప్పుడు ఆయన సినిమాను సమర్పిస్తున్నాను అంటూ నాని చిరు తో శ్రీకాంత్ ఓదెల తీయబోయే చిత్రం ఎనౌన్సమెంట్ ఇచ్చారు.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

ఇక పోస్టర్ ను, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన చిరు న్యూ మేకోవర్ ను చూసిన వారంతా కూడా ఇది కదా చిరు నుండి మేము ఆశిస్తున్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరు ఫ్యాన్ బాయ్ గా ఉన్న దసరా ఫేమ్ శ్రీకాంత ఓదెల ఇన్నాళ్లకు మెగాస్టార్ ను మళ్ళీ మాస్ యాక్షన్ హీరోగా వెండి తెర మీద చూపించబోతున్నారన్నమాట.

పవన్ ఫ్యాన్ బాయ్ సుజిత్ OG తో పవన్ అభిమానులను కిక్ ఎక్కిస్తుంటే, ఇటు చిరు ఫ్యాన్ బాయ్ ఓదెల మెగా అభిమానులకు మంచి విందు భోజనం పెట్టేలా ఉన్నారు. అలాగే ట్రెండ్ సెట్టర్ సందీప్ వంగా కూడా తన అభిమాన హీరో మెగా స్టార్ తో ఒక మాస్ మూవీ తీయాలని కోరుకుంటున్నట్టు ఒక ఇంటర్ వ్యూ లో తెలిపారు. ఇక చిరు, వంగా కాంబినేషన్ సెట్ అయితే అది వేరే లెవెల్ ఉంటుందేమో మరి..!




ఇప్పటికైనా మెగా స్టార్ తన చుట్టూ గీసుకున్న పరిమితులను దాటి ముందుకొచ్చి కొత్త తరం దర్శకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సినిమాలు తెరక్కించించగలిగితే చిరు తెలుగు ఇండస్ట్రీకి మరో బిగ్ బీ గా మారడం కాయం.