చిరు అడుగు పెట్టారట… ‘సర్ధార్’ సెంటిమెంట్ భయం..!

Chiru Pawan Kalyan Katamarayadu Movie Setsచాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కలయికకు వేదిక అయ్యింది “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా సెట్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను రూపొందించడంతో, దానిని వీక్షించడానికి చిరు స్వయంగా విచ్చేసారు. ఇక అప్పటి నుండి మెగా సోదరులిద్దరూ అప్పుడప్పుడు పలుసార్లు కలుసుకున్నారు. అయితే అదే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల తర్వాత మళ్ళీ మెగా సోదరుల కలయికకు అవకాశం లేకుండా పోయింది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు గానీ, చిరు కుమార్తె వివాహానికి గానీ, 150వ చిత్రం ప్రారంభోత్సవానికి గానీ పవన్ హాజరు కాలేదు. కానీ ఇన్నాళ్ళ తర్వాత మరొకసారి ఈ మెగా సోదరులిద్దరూ కలుసుకున్నారని తెలుస్తోంది. ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవి ‘కాటమరాయుడు’ సెట్స్ లో ప్రత్యక్షం కావడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి చిరంజీవి ‘ఖైదీ 150’కి సంబంధించిన పలు సన్నివేశాలను ‘కాటమరాయుడు’ సెట్స్ లో చిత్రీకరించే భాగంగా ఈ కలయిక జరిగినప్పటికీ, ఈ ఇద్దరూ సోదరులు ఒక గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT

ఇదిలా ఉంచితే, పవన్ సెట్ లోకి చిరు రాక పవర్ స్టార్ అభిమానులను కలవరపరుస్తోంది. “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా సెట్స్ లోకి మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ కావడం జరిగిపోవడంతో… తాజాగా మరొకసారి చిరు ఎంట్రీ పవన్ అభిమానులకు మనోవేదనను మిగిలిస్తోంది. మరి ‘సెంటిమెంట్’ ఇండస్ట్రీగా పేరుబడిన ‘సినిమా’ ఇండస్ట్రీలో ఇలాంటి నమ్మకాలు సర్వసాధారణమే కదా! ఈ సారి చిరు అడుగు మహిమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే… వచ్చే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories