డ్రగ్స్ కేసులో సెలెబ్రిటీలు బాధితులట

Clean chit to tollywood celebrities in drugs caseరెండేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు ఎవరూ ఇబ్బంది లేకుండా బయటప్డడారు. వారు నిందితులుగా కాకుండా బాధితులుగా ఎక్సైజ్ పోలీసులు తేల్చడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంతవరకు నాలుగు చార్జీషీట్లు దాఖలు చేసినా, సినీ ప్రముఖుల పేర్లు చేర్చలేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పోలీసులు వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చామని, ఈ కేసులో వారు బాధితులు అని చెప్పడం విశేషం.

సినీనటులు,దర్శకులంతా కలిసి 62 మంది విచారించామని, కొందరి నుంచి గోర్లు,వెంట్రుకల నమూనాలు కూడా కలెక్టు చేశామని వారు వివరించారు. అయితే వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 12 కేసులను నమోదు చేసిన సిట్‌ అధికారులు సెలబ్రిటీలకు మాత్రం క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. కాజల్ అగర్వాల్ మేనేజర్ గా పని చేసిన రోనీ అనే అతను డ్రగ్స్ తో పట్టుబడినా అతను కేసు నుండి బయట పడటం విశేషం.

ADVERTISEMENT

ఇటీవలే అతను ప్రొడ్యూసర్ గా అవతారమెత్తి మరో నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివను హీరోగా పని చేస్తూ ఒక సినిమా మొదలు పెట్టారు. దానికి కాజల్ సమర్పకురాలిగా ఉండటం గమనార్హం. ఆమె స్వయంగా ముహూర్తానికి హాజరయ్యి తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. సెలెబ్రిటీలను కాదు కదా కనీసం వారి దగ్గర పనిచేసిన వారినపై కూడా కేసు పెట్టకపోవడం విశేషం. మరోవైపు ఇటువంటి లాలూచీల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు కేసీఆర్ ప్రభుత్వానికి సాష్టాంగ పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories