కత్తి పట్టుకుంటారనుకోలేదు… ఇలా జలుబు జ్వరం అంటారనుకోలేదు!

Chandrababu Naidu Visited Pawan Kalyan

ఓజీ సక్సస్ మీట్‌లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నప్పుడు సరదాగా మాట్లాడుతూ, “డెప్యూటీ సిఎంనైన నా చేత కూడా ఇలా కత్తి పట్టుకునేలా చేశారు… అసలు ఈ సినిమాతో నేను డిప్యూటీ సిఎంనని మరిచిపోయేలా చేశారు,” అన్నారు. నిజమే

డిప్యూటీ సిఎం కత్తి పట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు… విచిత్రంగా చూస్తారు. కానీ ఎన్నికల ప్రచారంలో, సినిమాలలో కత్తులు, బాణాలు పట్టుకోక తప్పదు. కొందరు గొడ్డళ్ళు పట్టుకుంటారు ఉపయోగిస్తుంటారు కూడా. అది వేరే స్టోరీ!

ADVERTISEMENT

కానీ హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ కోసం పవన్‌ కళ్యాణ్‌ కత్తులు, బాణాలు అన్నీ పట్టుకున్నారు. అందుకు అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా చాలా సంతోషించారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ కంటే వయసులో చాలా పెద్దవారిన సిఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ చురుకుగా, ఆరోగ్యంగా పనిచేసుకుపోతుంటే, సాటి యువనేతతో పోటీ పడాల్సిన పవన్‌ కళ్యాణ్‌ నెలకోసారి జలుబు, జ్వరం, దగ్గు అంటున్నారు.

ముఖ్యంగా ఆయనని ఇప్పుడు ‘ఓజీ దేవుడు’గా చూస్తున్న అభిమానులకు తమ దేవుడికి జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలు అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా?

కనుక పవన్‌ కళ్యాణ్‌ పార్టీ, ప్రభుత్వం, పదవి, బాధ్యతలు, రాజకీయాలపైనే కాకుండా ఆరోగ్యంపై కూడా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో ఆయన సిఎం చంద్రబాబు నాయుడు వద్ద ఆరోగ్య చిట్కాలు, సూత్రాలు, రహస్యాలు తెలుసుకొని ఆచరిస్తే మంచిది. ఒకవేళ ఆయనేమైన రహస్యంగా అమృతం సంపాదించుకొని తాగుతున్నారేమో కనిపెట్టి తెలుసుకుంటే ఇంకా మంచిది. రాజకీయాలలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన పవన్‌ కళ్యాణ్‌ తరచూ ఈవిదంగా స్వల్పంగానైనా అనారోగ్యం పాలవుతుండటం మంచిది కాదు.

తన డెప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ అస్వస్థతకి గురవడంతో సిఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు.

ADVERTISEMENT
Latest Stories