‘కుమారి 21ఎఫ్’ను హగ్ చేసుకున్న కమెడియన్!

comedian-naveen-selfie-with-hibha-patelసుకుమార్ నిర్మించిన “కుమారి 21ఎఫ్” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హేబా పటేల్ అందాల ప్రదర్శనకు యువతరం ఫిదా అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.

‘జబర్దస్త్’ కమెడియన్ నవీన్ తో కలిసి ఉన్న ఈ సెల్ఫీ ఫోటోలో హేబా పటేల్ సదరు కమెడియన్ ను కౌగిలించుకుంటూ దర్శనమిచ్చింది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి ఫోజులను హీరోల వరకే పరిమితం చేస్తారు. అయితే హేబా ఒకడుగు ముందుకేసి కమెడియన్ కు కూడా హగ్ చేసుకునే అవకాశం కల్పించడం అనేది ‘కుమారి 21ఎఫ్’ సినిమా ప్రభావమేనా… అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాతోనే కాదు, సెల్ఫీతోనూ హేబా పటేల్ సెన్సేషన్ సృష్టిస్తోందన్న మాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories