మాట మార్చిన కాంగ్రెస్… భగ్గుమంటున్న మహాకూటమి పక్షాలు…

Congress Party Mahakutamiతెలంగాణ మహాకూటమి లో సీట్ల లొల్లి సాగుతున్నట్లు టీవీ లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకముందు టిడిపికి పదిహేను, సిపిఐకి ఐదు, టిజెఎస్ కు ఎనిమిది సీట్లు వరకు రావచ్చని ప్రచారం జరిగినా, తాజాగా కాంగ్రెస్ మాట మార్చినట్టు సమాచారం. టిడిపికి తొమ్మిది, సిపిఐకి రెండు తెలంగాణ జనసమితికి మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని సమాచారం వస్తోంది. ]

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు నవంబరు ఒకటో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోద ముద్ర వేయనుంది. అదే రోజు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారు. అయితే అప్పటికి కూడా పొత్తుల విషయం సెటిల్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

మొదటి జాబితాలో ముఖ్య నేతలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఒకే ఒక పేరు ఉండి..పొత్తుల చర్చల్లో లేని స్థానాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ ప్రక్రియ వల్ల మహాకూటమిలోని మిగతా పక్షాలు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే (నవంబరు 12వతేదీ)లోపు అభ్యర్థులందర్నీ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యం వల్ల నష్టపోతున్నాం అనే భావన ఇప్పటికే మిత్రపక్షాలలో ఉంది. ఇలాంటి క్రమంలో వారి సంగతి తేల్చకుండా తన మొదటి జాబితా ప్రకటిస్తే కాంగ్రెస్ కు ఇబ్బంది రావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories