కర్ణాటక రాజకీయాలలో సంచలనం నమోదయ్యింది. అక్కడ జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేస్తోంది. కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మూడు చోట్ల విజయం సాధించింది.
[m9ad]
మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా.. ప్రతిపక్ష భాజపా కేవలం ఒకే ఒక్క చోట ముందంజలో ఉంది. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు. మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
గాలి బ్రదర్స్ కంచుకోటైన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో ఉండగా.. మరో లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో కాంగ్రెస్-భాజపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.



