టీటీడీపీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య డైరక్ట్ వార్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. టీడీఎల్పీ నుండి తన ఫైల్స్, కంప్యూటర్ తీసుకెళ్లిన రేవంత్. “కొందరు పార్టీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. బాబు హైదరాబాద్ వచ్చే లోపే పార్టీని నాశనం చేసేలా ఉన్నారు,” రేవంత్ రెడ్డి ఈ సంధర్భంగా అన్నారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్‌రెడ్డిని ఆలింగనాలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. షేక్‌హ్యాండ్ ఇచ్చి వెల్‌కమ్ చెప్పిన సీనియర్ నేతలు – షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఐతే అసెంబ్లీకి వచ్చినా బీఏసీకి హాజరుకాని రేవంత్ రెడ్డి.
ఫ్లోర్ లీడర్గా రేవంత్ రెడ్డిని తీసేసిన క్రమంలో తెదేపా తరపున సండ్ర వెంకటవీరయ్య శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల అజెండాను దీనిలో ఖరారు చేయనున్నారు.


