గత ఎన్నికలలో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలలో ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒకరు. ఆయన ఒంగోలు ఎంపీ టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు.
అయితే ఆ తరువాత ఏమైందో తెలీదు గానీ తరచు మాగుంట ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన లిక్కర్ కంపెనీల బిల్లులు ప్రభుత్వం తొక్కిపెట్టిందట.
ఈ మధ్యనే ఆయన ఒంగోలు లో కార్యకర్తల మీటింగ్ పెట్టి మునుముందు ఏం చెయ్యాలి అనేదాని మీద మంతనాలు జరిపారని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి సొంత ఎంపీ మీదే క్రిమినల్ కేసు పెట్టిందట.
సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వుకుపోయారంటూ కేసు పెట్టారు. ఆ కేసులో ఆయనను ఏ-2గా చూపించారు. ఈ కేసు జనవరిలో నమోదు అయ్యింది. ఇప్పుడు ఉన్న ఫలంగా తెరమీదకు తెచ్చి ఎంపీకి ఒకరకంగా వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు… మాగుంటకు టీడీపీ నేతలు మద్దతుగా మీడియాలో మాట్లాడుతున్నారు. దీనితో ఆయన తిరిగి టీడీపీకి వెళ్తారా? లేక రఘు రామ కృష్ణ రాజు లాగా కొంత కాలం స్వపక్షంలో విపక్షంగా ఉంటారా అని జిల్లాలో చర్చ జరుగుతుంది.



