ఏపీలో అవినీతి ఉందో అభివృద్ధి జరుగుతుందో తేల్చుకోలేకపోతున్న బీజేపీ నాయకులు?

Daggubati Purandeswari say AP developmenmt only with BJP బీజేపీ రాష్ట్ర నేతల తీరే వేరుగా ఉంది. అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదని ఒకరు అంటుంటే, అభివృద్ధి జరుగుతుందని మరికొందరు అంటున్నారు. నిన్ననే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. మరి అసలు అభివృద్ధి జరుగుతున్నట్టా లేక ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఉన్నట్టా?

ఇలా వారిలో వారే అయోమయంలో ఉంటే తెలుగు దేశం ప్రభుత్వంపైకి ప్రజలను ఏం రెచ్చగొడతారు? వారు చేస్తున్న విమర్శలను ఎలా నమ్ముతారు? బహుశా ఇటువంటి అయోమయం వల్లేనేమో ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ పార్టీ సొంతంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు.

ADVERTISEMENT
Latest Stories