బాబు అరెస్టుకి నిరసన తెలపడానికి ఒక్కొక్కరుగా ముందుకురావడం గమనిస్తున్నాం. తొలుత విపక్ష పార్టీల మద్దతు, రాష్ట్ర బంద్ పేరుతో ప్రజా మద్దతు, ఐటీ ఉద్యోగుల సంఘీభావం, రాష్ట్రంలోని మహిళల కొవ్వొత్తి ర్యాలీలు, తాజాగా న్యాయవాదుల ఆందోళనలు, విదేశాలలో.., దేశంలోని మరికొన్ని మెట్రో సిటీస్ లో బాబు అరెస్టుని వ్యతిరేకిస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు.
అయితే సినీ రంగం నుంచి కూడా సూపర్ స్టార్ రజనీకాంత్., మురళీమోహన్, నారా రోహిత్, అశ్వనీదత్,నట్టి కుమార్, బండ్ల గణేష్…ఇలా మరికొద్దిమంది బాబు అరెస్టును ఖండిస్తూ బాబు కి తమ మద్దతు తెలియచేసారు. ఇదేసందర్భంలో భాగంగా స్టార్ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు స్పందించిన తీరు కొన్ని అనుమానాలకు తావిస్తుంది.
బాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ స్పందన అని అడిగిన ప్రశ్నకు సురేష్ బాబు మాట్లాడుతూ ఇది చాల సున్నితమైన అంశం. సినీ పరిశ్రమ అటు మతాలకు – ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఇండస్ట్రీ బాగుండాలి అంటే ఇటువంటి రాజకీయ క్రీడలోకి తాము ఆడుగుపెట్టక పోవడమే మంచిది అనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక తెలుగు సినీ పరిశ్రమ ఎన్నడూ ఊహించని విచిత్ర – విడ్డుర పరిస్థితులను ఎదుర్కొందనే చెప్పాలి. అటు సినిమాలలో నటిస్తూ ఇటు రాజకీయ పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదలకు సైతం జగన్ ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాలు చూస్తూ మరెవరు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పగలరు అనే ప్రశ్న ఇండస్ట్రీ నుంచి వస్తుంది.
జగన్ ప్రభుత్వాన్ని విమర్శించవలసిన అవసరం లేదు మరొకరి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నా వారికి సేమ్ ట్రీట్మెంటే అమలు చేస్తారు అని రజనీకాంత్ విషయంలో ఇప్పటికే రుజువయ్యింది. న్యాచురల్ స్టార్ నాని సినీ ఇండస్ట్రీ పై ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న చర్యల పై చేసిన చిన్న పాటి సద్విమర్శ ను సైతం తీసుకోలేని వైసీపీ ప్రభుత్వం నాటి నాని సినిమా కలెక్షన్లను దెబ్బకొట్టడంలో గెలుపొందింది.
బోళా శంకర్ ఫంక్షన్లో చిరు వ్యాఖ్యల పై ఏపీ మంత్రుల విమర్శలకు కనీసం కౌంటర్ వేయలేని స్థితిలో అక్కడి పెద్దలున్నారని భావించాల్సి వస్తుంది. బ్రో సినిమా విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి సినిమా నిర్మాతలను, రచయితలను , దర్శకులను, నటీమణులను ఒక రకంగా అంబటి రాంబాబు బెరించారనే చెప్పాలి. అటువంటి వ్యాఖ్యలు చూస్తేనే అర్ధమవుతుంది సినీ ఇండస్ట్రీని, సినీ పెద్దలను వైసీపీ ప్రభుత్వం ఏరకంగా భయపెడుతుందో అని.
సినిమా టికెట్స్ నుంచి “మా” ఎల్లక్షన్ల వరకు జగన్ తాను ఏమనుకుంటున్నాడో అదే చేసాడు, తనకి ఎవరు గెలవాలో వారినే గెలిపించాడు అనేది సినీ సర్కిల్స్ లో వినపడుతున్న మాట. ఇప్పుడు కోరుండి కొరివితో తల ఎవరు గొరిగించుకోవాలని కోరుకుంటారు అనే తీరుగానే తెలుగు సినీ పరిశ్రమ స్తబ్దుగా ఉందేమో. అంతే లెండి “సీత కష్టాలు సీతవి…పీత కష్టాలు పీతవి”.
M9 News Asks Suresh Babu about Industry‘s silence over Chandrababu Naidu#ChandrababuArrest pic.twitter.com/clehsVuSgG
— M9.NEWS (@M9Breaking) September 19, 2023