నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న పీరియడ్ ఫిలిం ‘డెవిల్’. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ప్రొడక్షన్ లో ప్రారంభం అయ్యింది. మొన్న ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ లో డైరెక్టర్ పేరు లేదు. కేవలం ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ అని ఉంది.
ఇప్పుడు తాజాగా వచ్చిన పోస్టర్ లో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా అని పేరు మారింది. దీనిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.
గతంలో నవీన్, అభిషేక్ కలిసి బాబు బాగా బిజీ అనే సినిమా తీశారు. అది ప్లాప్ అయ్యింది. ఆ తరువాత నవీన్ ఆహా లో సిన్ అనే సినిమా తీశారు. నామా నవీన్ ని నమ్మి శ్రీకాంత్ విస్సా (పుష్ప రైటర్) తెచ్చిన డెవిల్ స్క్రిప్ట్ అతని చేతిలో పెట్టారు.
ఇప్పుడు ప్రాబ్లెమ్ ఏంటి అనే దాని పై ప్రొడ్యూసర్ కి సంబంధించిన సోర్సెస్ వాదన ఇలా ఉంది:
“మొదటి షెడ్యూల్ లోనే నవీన్ హేండిల్ చెయ్యడంలో ఇబ్బంది పడుతున్నాడని, ఆర్టిసులు, టెక్నిషన్స్ కంప్లయింట్స్ ఎక్కువయ్యి ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ ఎక్కువైందట.
40 కోట్ల సినిమా కావడం తో రిస్క్ తీసుకోలేక స్వతాహా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ అయిన అభిషేక్ నామా బాధ్యతలు తీసుకుని సినిమా దాదాపుగా పూర్తి చేశారట. ఇంకో లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుందట.
అభిషేక్ నామా ఫ్యామిలీ రెండు జనరేషన్స్ గా ఇండస్ట్రీలో ఉంది. దానికి తోడు ఆయన సినిమాల ప్రొడక్షన్ డిజైన్ లో కూడాపూర్తిగా వర్క్ చేస్తారు. ముందుగా చెప్పినట్టు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కావడంతో ఈజీగానే పని ముగిసిందట.
ముందు సైలెంట్ గా పని పూర్తి చేద్దాం అనుకున్నా ఆ తరువాత ఇప్పుడు శ్రేయోభిలాషుల సూచన మేరకు పేరు మార్పు కూడా పబ్లిక్ చేసేశారు”.
మరోవైపు… M9 News దర్శకుడి నవీన్ మేడారం వెర్షన్ కోసం కూడా ట్రై చేస్తుంది.
కళ్యాణ్ రామ్ సినిమా కాంట్రవర్సీ… డైరెక్టర్ వెర్షన్ వేరే!





