నెహ్రుకు హద్దులు ఉంటాయని తమ్ముళ్ళుకు బాబు భరోసా!

devineni nehru Limitation in TDPరాష్ట్ర రాజధాని విజయవాడలో కొత్త వారి చేరికతో తెలుగుదేశం నాయకులకు రాజకీయ భద్రత కరువైనట్లుగా ఉంది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిలా మాట్లాడే దేవినేని నెహ్రు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్న నేపధ్యంలో తెలుగుదేశం గన్నవరo ఎం.ఎల్.ఎ వల్లభనేని. వంశీ , పెనమలూరు ఎం.ఎల్.ఎ బోడె. ప్రశాద్ విజయవాడలో చంద్రబాబుతో భేటి అవడంపై నెహ్రు వర్గం వారు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం కొత్త వారి చేరికతో పార్టీని మరింత బలోపేతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలి గాని వారితో మీరు విభేదాలు తెచ్చుకోవద్దని తెలుగు తమ్ముళ్ళుకి హితవు పలికారని విశ్వసనీయ సమాచారం. దేవినేని నెహ్రు తన నియోజకవర్గ పరిధికి లోబడి మాత్రమే పని చేయవలసి ఉంటుంది. అంతేగాని వారి చేరిక వలన ఎవరికీ ఎటువంటి రాజకీయ అభద్రత ఉండదు అని బాబు గారు తన దగ్గరకు వచ్చిన తెలుగుదేశం నాయకులకు భరోసా ఇచ్చారని దానితో తెలుగు తమ్ముళ్ళు తృప్తి చెందినట్లు ఉన్నారట. కొత్తగా చేరేవారికి చంద్రబాబు ముందుగానే హద్దులు నిర్ణయిస్తారని ఆ హద్దుల మేరకే వారి నాయకత్వం పని చేయవలసి వస్తుందని బాబు గారు చెప్పకనే చెప్పినట్లుందని ఈ భేటిని పరిశీలించిన వారికి అవగతం అవుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories