జగన్ ను విమర్శించడమంటే దేశద్రోహమా?

Devineni Uma was interrogated by CID officials ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి తిరుపతి ఉపఎన్నికలలో లబ్ది పొందాలని యత్నించారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ పై సిఐడి కేసు పెట్టింది. నిన్న విచారణకు హాజరైన ఆయనను దేశద్రోహం కేసో లేక ఇంకొకటో అన్నట్టు ఏకంగా తొమ్మిది గంటలు విచారించారు సీఐడీ అధికారులు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి జగన్ పై మార్ఫింగ్ వీడియో చేయించారని చెబితే ఆయనను ఇంటరాగేషన్ నుంచి తప్పిస్తామని సిఐడి అధికారులు అన్నారని ఉమ చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోనే తాను ప్రదర్శించానని, తనకు ఆ వీడియో చంద్రబాబు ఇవ్వలేదని విచారణలో ఉమ చెప్పారని మీడియాలో కధనాలు వచ్చాయి.

ADVERTISEMENT

ఇంత చిన్న కేసును ఇంకేం పని లేనట్టు సీఐడీ ఇంత సీరియస్ గా తీసుకోవడం పై సోషల్ మీడియాలో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ కేసులో టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, లోకేశ్‌ తదితరులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

“సీఐడీ అధికారులు ఇంత ఖాళీగా ఉన్నారా? ఈ శ్రద్ద అప్పట్లో వివేకా కేసు మీద పెట్టి ఉంటే సీఎం సొంత సోదరి సిబిఐ విచారణ కోరుతూ కోర్టులకు మీడియా ముందుకు తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. సీఎం జగన్ ని విమర్శిస్తే అదేమన్నా దేశద్రోహం లేదా ఉగ్రవాదానికి సంబంధించిన కేసు అంటున్నారా?,” అంటూ విమర్శలు చేస్తున్నారా?

ADVERTISEMENT
Latest Stories