“లీకుల” వెనుక ఉన్నదెవరూ…? ఇంతలోనే ఎందుకు తొలగించింది..?

Dhanush Sister Vimala Geetha Responds On Suchitra Tweetsగాయని సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ ఖాతా నుంచి సెలబ్రెటీల వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలలో ప్రముఖ నటి త్రిషతో హీరో ధనుష్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే రాత్రి సమయంలో వీళ్ళందరూ కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. ఈ విషయమై ధనుష్ స్పందించకపోయినప్పటికీ, అతని సోదరి విమల గీత మాత్రం తన దైన శైలిలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ సుదీర్ఘ లేఖ రాశారు.

గత కొన్ని నెలలుగా తమ కుటుంబం రకరకాల వివాదాలతో బాధపడుతోందని, అయినా, తమ కుటుంబం మౌనంగానే ఉందన్నారు. మొదట్లో తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమని, ఒక వ్యక్తి కష్టంతో ఈ రోజున తాము ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పారు. తేనీలోని ఓ గ్రామానికి చెందిన తమ కుటుంబం ఎన్నో బాధలను అనుభవించిందని, తమ సోదరులు ఎన్ని అవమానాలు భరించారో ఆ దేవుడికే తెలుసని అన్నారు. తమ కుటుంబం విలువలకు కట్టుబడి బతుకుతోందని అన్నారు. ఈ రోజున ధనుష్ పెద్ద స్టార్ అని, ఈ స్థాయికి రావడానికి ధనుష్ ఎంత కష్టపడ్డాడో తోడబుట్టినదానిగా తనకు తెలుసని అన్నారు.

ADVERTISEMENT

మనుషుల క్యారెక్టర్ ను తప్పుబట్టడం మీడియాకే సాధ్యమని, ట్విట్టర్, ఫేస్ బుక్ లు వేదికగా ఏదైనా మాట్లాడటానికి, పోస్ట్ చేయడానికి కొంత మంది దిగజారారని అన్నారు. ఫేక్ వీడియోల గురించి తమ కుటుంబాన్ని ప్రశ్నించడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న విమల గీత, ఈ విషయమై తాను చాలా అసహనంగా ఉన్నానని, తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలకు గుడ్ బై చెబుతున్నానని, ఈ విధంగా చేస్తున్నది ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదని అన్నారు.

ఈ ఫోటోల లీక్ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని, ఈ చర్యల వల్ల ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే వారి ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, ఇకనైనా దీనికి పుల్ స్టాప్ పెట్టాలని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇది పోస్ట్ చేసిన కాసేపటికే సదరు పోస్ట్ ను విమల గీత తొలగించడం జరిగింది. ఇప్పటివరకు ధనుష్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోగా, త్రిష మాత్రం ఓ ఇమేజ్ ఓ ఉన్న వేదాంత సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చింది.

ADVERTISEMENT
Latest Stories