“ధృవ”లో రెండు సార్లు ‘పవర్’ వేసారేంటి!

dhruva-movie-ram-charan-screen-name‘ధృవ’ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూసారో, పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా అంతగానే వేచిచూసారని చెప్పవచ్చు. మొన్నటివరకు ‘మెగా పవర్ స్టార్’గా చెర్రీ పేరు టైటిల్ కార్డ్స్ లో పడ్డప్పటికీ, గత రెండు సినిమాల నుండి ఎలాంటి ‘బిరుదు’ లేకుండానే రామ్ చరణ్ పేరు పడుతోంది. అయితే ఈ సినిమాలో మాత్రం ‘యంగ్ మెగాస్టార్’ అని పడబోతుందన్న సంకేతాలు ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తం కావడంతో… చెర్రీ పేరుకు ముందు ఏం పడబోతుందా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

అయితే గాసిప్ రాయుళ్ళకు షాక్ ఇచ్చే విధంగా “ధృవ” సినిమాలో రామ్ చరణ్ ‘మెగా పవర్ స్టార్’గానే పరిచయం అయ్యాడు. అది కూడా ఒకసారి కాదు, ఏకంగా రెండు సార్లు ‘మెగా పవర్ స్టార్’ అన్న పేరు పడడం విశేషం. సహజంగా హీరో ఇంట్రడక్షన్ లో పడే పేరు సమయంలో ఇలాంటి బిరుదులు టైటిల్ కార్డ్స్ లో పడుతుంటాయి. కానీ, ‘ధృవ’ సినిమాకు మాత్రం టైటిల్ కార్డ్స్ తో పాటు, ఎండ్ కార్డ్స్ లోనూ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ అంటూ స్క్రీన్ పై పడడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT

అంటే పవర్ స్టార్ తో తమకున్న అనుబంధాన్ని గట్టిగా చెప్పాలని రెండు సార్లు వేసారా? లేక ఎలాంటి పుకార్లకు తావివ్వరాదని అలా రెండు సార్లు వేసారా? బహుశా ఒక్కసారి స్క్రీన్ పై పడినట్లయితే… పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకునేది కాదు గానీ, ఈ బిరుదు విషయంలో ఇటీవల జరిగిన రచ్చ దృష్ట్యా, రెండు సార్లు స్క్రీన్ పై ‘మెగా పవర్ స్టార్’ అని రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తాజా పరిణామాలతో ఇక నుండి చెర్రీని ‘మెగా పవర్ స్టార్’గా అభివర్ణించవచ్చని మెగా కాంపౌండ్ చెప్పకనే చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories