తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ దాదాపుగా 2.7 లక్షల మెజారిటీ తో గెలిచింది. అయితే పోలింగ్ రోజు జరిగిన దొంగ ఓట్ల హంగామా తో అధికార పార్టీ అభాసుపాలు అయ్యింది. దానితో అసలు విజయం నిజమైనదేనా అనే అనుమానాలు ప్రజల్లోకి వెళ్లాయి. తాజాగా దొంగ ఓట్లే కాదు వాలంటీర్ల వ్యవస్థ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేసి విజయానికి దోహదపడిందని టీడీపీ ఆరోపిస్తుంది.
ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ ని విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం కురిచెర్లపాడులో కె.శేషమ్మ అనే లబ్ధిదారురాలికి వలంటీర్ తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వెయ్యలేదనే కారణంగా పింఛన్ ఆపేశాడని ఆ ఫోన్ కాల్ తో తేటతెల్లం అవుతుంది.
“సంక్షేమ పథకాల అమలులో కులం చూడం.మతం చూడం.పార్టీ చూడబోమని సీఎం జగన్ గారు గొప్పగా చెబుతుంటారు. ఆచరణలో మాత్రం అంతా రివర్స్..ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కి ఓటు వేయలేదని సర్వేపల్లి నియోజకవర్గం కురిచెర్లపాడులో కె.శేషమ్మ అనే లబ్ధిదారురాలికి వలంటీర్ పింఛన్ ఆపేశాడు,” అన్నారు సోమిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు అన్నీ ఇలాగే బెదిరించి వేయించుకున్నవి, అలాగే దొంగ ఓట్లు అని… అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన పార్టీ రెండేళ్లు పూర్తి అయ్యేసరికి ఇటువంటి పరిస్థితిలోకి వచ్చేశారని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలులో కులం చూడం.మతం చూడం.పార్టీ చూడబోమని సీఎం @ysjagan గారు గొప్పగా చెబుతుంటారు.ఆచరణలో మాత్రం అంతా రివర్స్..ఎన్నికల్లో @YSRCParty కి ఓటు వేయలేదని సర్వేపల్లి నియోజకవర్గం కురిచెర్లపాడులో కె.శేషమ్మ అనే లబ్ధిదారురాలికి వలంటీర్ పింఛన్ ఆపేశాడు..ఇదేంటని ప్రశ్నిస్తే… pic.twitter.com/8FGaWTIpbZ
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 5, 2021





