దిల్ రాజు సరికొత్త సంప్రదాయం!

Once Again Dil Raju Locks Horns Against Chiranjeevi సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదలకు ముందు మీడియా వారినీ, సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని పిలిచి ‘స్పెషల్ ప్రివ్యూ’ షోలు ప్రదర్శిస్తుంటారు. తద్వారా ఆ సినిమాకి సంబంధించిన టాక్ బయటికి వెళితే, ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారని భావిస్తూ వుంటారు. అయితే ‘వెళ్లిపోమాకే’ సినిమా ప్రివ్యూ విషయంలో నిర్మాత దిల్ రాజు సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఈ సినిమా ప్రివ్యూలను సామాన్య ప్రేక్షకులు కూడా వచ్చి చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు బ్రాండ్ తో విడుదలకు సిద్ధమైన ‘వెళ్లిపోమాకే’ సినిమాకు ఎంతమంది వస్తే అంత మందికీ ప్రివ్యూలు వేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొదటి ప్రివ్యూను ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ మంది మాట్లాడుకుంటే అంత మంచిదనే ఆలోచనలో దిల్ రాజు వున్నాడని భావిస్తుండగా, సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories