‘జనతా గ్యారేజ్’ నుండి బయటకు వచ్చిన ‘ఎన్టీఆర్’

Director Bobby To Direct Jr NTR next Movieజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో నెంబర్ 1 సినిమాగా నిలిచిన “జనతా గ్యారేజ్” విడుదలై 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ 100 రోజుల పోస్టర్స్ ను విడుదల చేసింది. ఊహించని సక్సెస్ తో పార్టీలు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. టాలీవుడ్ టాప్ దర్శకుల నుండి కోలీవుడ్ డైరెక్టర్ల వరకు అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ, ఫైనల్ గా తెరపైకి వచ్చింది మాత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు బాబీనే.

ADVERTISEMENT

‘జనతా గ్యారేజ్’ వంద రోజులు పూర్తయితే గానీ, ఈ సినిమా నుండి జూనియర్ బయటపడలేదేమో అన్నట్లుగా… ఆ వంద రోజుల పోస్టర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నుండి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మా సొంత బ్యానర్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించనున్నామని కళ్యాణ్ రామ్ చేసిన ట్వీట్ తో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, తారక్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందన్న టాక్ అప్పుడే ఊపందుకుంది.

ఇదిలా ఉంటే… అసలు బాబీ స్క్రిప్ట్ ను ఓకే చేయడం వెనుక కూడా ‘జనతా గ్యారేజ్’ కొరటాల శివ ఉన్నారని, ఈ కధను ఎంపిక చేయడంలోనూ, ఈ కధకు కొన్ని సూచనలు చేయడంలోనూ కొరటాల పాత్ర ఉందనేది సినీ జనాల టాక్. తొలి చిత్రం ‘పవర్’తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న బాబీ, మలిచిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో మాత్రం తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. మరి ముచ్చటగా ప్రారంభం కాబోతున్న మూడవ చిత్రం ఎలాంటి అనుభూతులను పంచుతుందో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories