స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపధ్యంలో తీసిన సినిమా, యాత్ర. ఎన్నికల ముందు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ కు ఈ సినిమా బానే ఉపయోగపడిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆ సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సిండికేట్ అనే యాక్షన్ డ్రామా తీస్తున్నట్టు మహి వి రాఘవ్ ప్రకటించారు. ఈ సినిమాకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లింకు ఉండడం విశేషం.
ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఈ మధ్య రాజకీయంగా బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు. మహి వీ రాఘవ్ ఈ సినిమా బౌండ్ స్క్రిప్టు మీద పని చేస్తున్నారు. తొందరలో సినిమా లోని నటీనటులను కూడా ఫైనల్ చేస్తారు. ఆయన మొదటి సినిమా ఆనందో బ్రహ్మ కూడా పెద్ద హిట్ అయ్యింది అప్పట్లో…. దీనితో సిండికేట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
మొదటి సినిమా హారర్ కామెడీ… రెండో సినిమా పొలిటికల్ బయోపిక్ వంటి విభిన్న సబ్జెక్టులు ట్రై చేసిన దర్శకుడు ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా యాక్షన్ డ్రామా వైపు మొగ్గు చూపారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ పొట్లూరి వరప్రసాద్ దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్నాం అని ప్రకటించారు.



