బాక్సాఫీస్ మాట్లాడడం లేదుగా… హరీష్ మాట్లాడతారేమో..!

Duvvada-Jagannadham-Box-Office-Collectionsఇటీవల జరిగిన “దువ్వాడ జగన్నాధమ్” కృతజ్ఞతల సభలో హరీష్ శంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా గురించి నేనేం మాట్లాడను, ఆల్ రెడీ బాక్సాఫీస్ మాట్లాడుతోందిగా… ఇప్పటికే 75 కోట్లు వచ్చేసాయి, చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు కనుమరుగవుతున్నాయి… అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కన పెడితే… ఏపీ, తెలంగాణాల వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అయితే చెన్నై, ఓవర్సీస్ లలో మాత్రం ఈ సినిమా ఆశించిన ఆదరణకు నోచుకోలేకపోయింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ కు చేరుకోవడానికే ముప్పతిప్పలు పడుతోంది. మహా అయితే ఆ 1 మిలియన్ పూర్తి చేసుకుంటుందేమో! అయితే కనీసం బ్రేక్ ఈవెన్ రావాలంటేనే 2.5 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంది. మరి ఈ తరుణంలో 1 మిలియన్ డాలర్స్ అందుకుంటున్న “డీజే”ను ఓవర్సీస్ లో భారీ ఫ్లాప్ గా ఇప్పటికే డిక్లేర్ చేసారు. అంటే హరీష్ చెప్పినట్లుగా యుఎస్ లో బాక్సాఫీస్ అస్సలు మాట్లాడలేదన్న మాట. అంటే ఈ టూర్ లో హరీష్ వీరలెవల్లో మాట్లాడతారేమో చూడాలి.

ADVERTISEMENT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే లతో పాటు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు యుఎస్ వెళ్లనున్నారు. నిజానికి ఒక ఓపెనింగ్ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ షెడ్యూల్ ముందుగానే ప్రణాళిక సిద్ధం కాగా, సమయానికి ‘డీజే’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడంతో చిత్ర ప్రమోషన్స్ కోసం కూడా వినియోగించుకుంటున్నారు. అయితే యుఎస్ లో ఇప్పటికే ‘డిజాస్టర్’గా డిక్లేర్ చేసిన ఈ సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేసినా ప్రయోజనం ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories