వైరల్ : ‘డీజే’ టీంకు స్ట్రాంగ్ సందేశం!

Duvvada Jagannadham Reviews‘థాంక్యూ మీట్’ అన్న పేరుతో ‘సందేశాల మీట్’ ఇచ్చిన ‘దువ్వాడ జగన్నాధమ్’ చిత్ర యూనిట్ సభ్యులకు ఓ సగటు సినీ అభిమాని వ్యక్తపరిచిన ప్రశ్నల వర్షం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా రివ్యూలు చూడకుండా, సినిమా చూసి ఎవరికి వారు తెలుసుకోండి అంటూ ‘డీజే’ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ… సంధించిన ప్రశ్నల వర్షం, ఇలా రివ్యూలను కామెంట్ చేసే ప్రతి సినీ సెలబ్రిటీకి తగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఆ ప్రశ్నలను పరిశీలిస్తే…

1) రివ్యూ చూడకుండా, ఎవరికి వారు సినిమా చూసి తెలుసుకోండి అంటున్నారు, ఎందుకు చూడాలి? మీరు ఉచితంగా ఏమైనా చూపిస్తున్నారా? బాగోని సినిమా కోసం మేము ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలి?

ADVERTISEMENT

2) మీరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కదా… ఒక ఏడాదిలో విడుదల అవుతున్న వందల సినిమాలలో ఎన్ని సినిమాలను చూస్తున్నారు? ఒకవేళ చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేస్తారా? ఒకవేళ చూడకపోతే ఎందుకు చూడడం లేదు?

3) ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాదేనా? మీకు లేదా? ఉంటే మీరు అన్ని సినిమాలు ఎందుకు చూడడం లేదు?

4) మీరు ఒక ఫోన్, ఒక కారు వాడుతున్నారు కదా! ఎందుకు అవే వాడుతున్నారు? వాటి పెర్ఫార్మన్స్ బాగుంది అని మీకు ఎలా తెలిసింది? రివ్యూనే కదా? మార్కెట్ లో రిలీజ్ అయిన ప్రతి కారును, ఫోన్ ను ఎందుకు వాడటం లేదు? మనీ వేస్ట్ అణా? వాటి మేకర్స్ కూడా చాలా మనీ సస్పెండ్ చేస్తున్నారుగా!

5) మీవేనా డబ్బులు? మావి కావా? మీరు డబ్బులు పెట్టారు కదా అని జాలిపడి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తే, మా మీద వేరే వారు జాలి చూపించాల్సి ఉంటుంది.

ఈ ప్రశ్నలన్నీ ఒక్క ‘డీజే’ యూనిట్ కే కాదు, రివ్యూలను ఆధారంగా చేసుకుని సినిమాలను చూడవద్దని చెప్తున్న పూరీ జగన్నాధ్ వంటి దర్శకులకు కూడా ఖచ్చితంగా తగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాస్త వ్యంగ్యంగా ఉన్నా… ఈ ప్రశ్నలన్నీ అక్షర సత్యాలు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా, ఒక సంవత్సరంలో విడుదల అవుతోన్న వందల సినిమాలలో ఎన్ని సినిమాలను వీరు చూస్తున్నారు? అన్న ప్రశ్న మననం చేసుకుంటే చాలు… మిగతా అయిదు వ్రేళ్ళు మన వైపే చూపిస్తున్నాయని అర్ధమవుతుంది..!

ADVERTISEMENT
Latest Stories