‘ఫ్లాప్’ అయిన సినిమాకు ఈ ‘ఉత్సాహం’ ఏంటి?

Duvvada-Jagannadham-USA-Reportబాక్సాఫీస్ వద్ద భిన్న స్పందనలు తెచ్చుకున్న “దువ్వాడ జగన్నాధమ్” కలెక్షన్స్ ఏపీ, తెలంగాణాలలో ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లలో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. అల్లు అర్జున్ గత చిత్రం ‘సరైనోడు’ బాటలోనే ‘దువ్వాడ జగన్నాధమ్’ కూడా చేరిపోయిందని, తాజాగా గడిచిన వారం చెప్పకనే చెప్పింది. అతి కష్టం మీద 1 మిలియన్ డాలర్స్ కు చేరుకున్న ఈ సినిమాకు ప్రమోషన్ ఇచ్చేందుకు, చిత్ర యూనిట్ ఇటీవల యుఎస్ ట్రిప్ వేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే సినిమాతో పాటు ఈ ట్రిప్ కూడా ఫ్లాప్ కావడం విశేషం. ‘డీజే’ మెయిన్ అట్రాక్షన్ అల్లు అర్జున్, పూజా హెగ్డేలతో సహా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు పాల్గొన్న ప్రమోషన్స్ కు ప్రేక్షకుల నుండి స్పందన కరువైంది. ‘డీజే’ను ధియేటర్లలో చూడడానికి ఇష్టపడని ప్రేక్షకులు, ఆ సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలను వ్యక్తిగతంగా చూడడానికి కూడా ఆశించిన ఉత్సాహం చూపకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో యుఎస్ ట్రిప్ ముగించుకుని ఇండియాకు విచ్చేస్తున్నారు.

వీటన్నికంటే ముఖ్యంగా… ఎన్ఆర్ఐలను ఉద్దేశిస్తూ దర్శకుడు హరీష్ శంకర్, హీరో అల్లు అర్జున్ లు చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. యుఎస్ లో ఎలాంటి ఫలితం వచ్చినా, సినిమాకు సంబంధం లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు, బహుశా బన్నీ, హరీష్ శంకర్ల భవిష్యత్తు సినిమాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే యుఎస్ లో ‘డీజే’ డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలు వచ్చినా పర్లేదు అన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆహ్వనించదగినవి కావని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories