బాలీవుడ్ లో ‘బోల్డ్’ మూవీస్ ను నిర్మించడంలో ముందుండే నిర్మాతలలో ఒకరైన ఏక్తా కపూర్, తాజాగా హీరోయిన్లపై చేసిన కామెంట్స్ బాలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో అన్నీ ఇండస్ట్రీ ‘వుడ్’లను ఊపేసిన ‘కాస్టింగ్ కౌచ్’ అంశంపై తనదైన శైలిలో స్పందించడమే ఏక్తా కపూర్ ను మళ్ళీ వార్తల్లో నిలిపే వ్యక్తిగా చేసింది. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేతగా ఒక నిర్మాతగానే కాకుండా, మెగా ఫోన్ చేపట్టి ‘XXX’ సినిమాకు శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన ఏక్తా, ‘కాస్టింగ్ కౌచ్’లోని రెండో కోణాన్ని ఎత్తి చూపించింది.
ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు తమతో చేసిన హీరోలు, దర్శకులు, నిర్మాతల పైనే ఎక్కువగా అభియోగాలు చేసారు. కానీ ఏక్తా విషయంలో మాత్రం… ఈ వర్షన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. పవర్, పొజిషన్ ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ వద్దకు హీరోయిన్లే వస్తుంటారని, దానికి నిర్మాతలను నిందించడం సరికాదని అభిప్రాయపడింది. ఒక హీరోయిన్ అర్ధరాత్రి నిర్మాతను కలిసి, తర్వాత రోజు తన రోల్ ఏంటి? అవకాశం ఇవ్వమంటే తప్పెవరిది? అంటూ తన భావాన్ని పంచుకుంది.



