తెరాస తాజా మాజీపై తెలంగాణాలో తొలి ఎన్నికల కేసు!

Election code of conduct case on Enugu Ravinder Reddyకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఒక రికార్డు సృష్టించారు. తెలంగాణ అవతరించిన తరువాత ఆయన పై మొదటి ఎన్నికల కేసు పడింది. త్వరలో జరిగే ఎన్నికల ముందు కూడా ఇదే తొట్టతొలి కేసు. తనకు ఓటేస్తే కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేస్తే 5లక్షల ఇస్తానంటూ మార్కల్‌లో డ్వాక్రా మహిళలను రవీంద్రరెడ్డి ఇటీవల ప్రలోభపెట్టారు.

ADVERTISEMENT

[m9ad]

దీనికి సంబంధించి వీడియో బయటకు రావడం అది సోషల్ మీడియా లో హుళచల్ చెయ్యడంతో ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

అయితే ఇటువంటి ఎన్నికల కేసుల వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, మహా అయితే కొన్ని నెలల పాటు కోర్టుల చుట్టూ తిరిగి తరువాత కొట్టించేసుకోవడమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అవును మరి ఈరోజు రేపు ఏ కేసులు మాత్రం రాజకీయ నాయకులను ఏమి చేయ్యగలవు?

ADVERTISEMENT
Latest Stories