టీజర్ తో మురిపించి ట్రైలర్ తో మరపించేలా చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “ఫిదా” తొలి పాట ప్రేక్షకులను పలకరించింది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చారు. ‘వచ్చిండే… మెల్లమెల్లాగా వచ్చిండే… క్రీము బిస్కెట్ వేసుండే…’ అంటూ మొదలైన పాట ఫస్ట్ అట్టెంప్ట్ లోనే వీనులవిందుగా ఉంటుంది.
పెళ్లి మండపంలో హీరోయిన్ పల్లవి హీరో వరుణ్ తేజ్ ను ఆటపట్టించే పాటగా లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ‘ఆడపిల్లనమ్మా’ ఫేం మధుప్రియ స్వరం ఈ పాటకు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. తెలంగాణా యాసలో వినిపించే లిరిక్స్ శ్రోతలకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ను పంచుతుంది. శేఖర్ కమ్ముల మార్క్ కనపడుతున్న ఈ పాట, రానున్న రోజుల్లో చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం.
ADVERTISEMENT
ADVERTISEMENT



