విజయవాడ అభివృద్ధి కాకపోవడానికి కారణం అదే!

Gannavaram Airport For Andhra Pradeshగన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరిలతో కలసి అంతర్జాతీయ టెర్మినల్ ను ప్రారంభించారు. దీనికి తోడు రన్ వే విస్తరణ పనులకు కూడా భూమి పూజ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టును రేకుల షెడ్డు దశ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

నూతన ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు రావాలనేదే తన కోరిక అని, ఏ పని చేయాలన్నా భూమి కావాలని… భూమి కొరత వల్లే విజయవాడ అభివృద్ధి కాలేదని కీలక వ్యాఖ్యలు చేసారు. గన్నవరం నుండి మచిలీపట్నానికి రోడ్డు వేస్తే పోర్టుకు కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే వారి చెప్పుడు మాటలను రైతులు వినరాదని… రైతులు భూములు ఇస్తే పోర్టు విస్తరణ పనులను చేపడతామని తెలిపారు.

ADVERTISEMENT

ఈ టెర్మినల్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం…
నిర్మాణానికి అయిన ఖర్చు 162 కోట్లు
వైశాల్యం 12,642 చదరపు మీటర్లు
18 చెక్ ఇన్ కౌంటర్లు
6 బోర్డింగ్ గేట్లు
300 కార్లకు పార్కింగ్ సౌకర్యం
గంటకు 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం
అత్యాధునిక సీసీ కెమెరాలు, స్క్రీన్లు, మూడంచెల విధానంలో సెక్యూరిటీ
స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా కొండపల్లి బొమ్మలు, కలంకారీ చిత్రాలతో టెర్మినల్ ను తీర్చిదిద్దారు.

ADVERTISEMENT
Latest Stories