టాలీవుడ్ లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తన వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణకు బంధువైనందునే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో జారీ చేయడంపై మండిపడింది. దీంతో ఈ సినిమాకు ప్రభుత్వం కల్పించిన పన్ను మినహాయింపు జీవోను 14ను రద్దు చేస్తామని, మరో రెండు రోజుల్లో కొత్త జీవో ఇస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



