కేటీఆర్ – జగన్ – పవన్ – లోకేష్ – రేవంత్…జెన్ జీ లీడర్ ఎవరు.?

Gen Z Politics: Nara Lokesh, Jagan, KTR, Revanth or Pawan Kalyan?

నీట్ ఉద్యమంతో దేశ రాజకీయాలలో జెన్ జీల పాత్ర పై విస్తృతమైన చర్చ నడుస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ జెన్ జీ ల ఆకర్షణకు రాజకీయ పార్టీలు, పార్టీల నాయకులు పోటీకి సిద్ధమయ్యాయి.

అందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డీఎస్సి లో అక్రమాలు అంటూ సీజేపీ మాదిరి ఏపీ యువతను మేల్కొలిపే పనిలో పడ్డారు. అయితే జగన్ పిలుపుతో ఏపీ జెన్ జీ లు వైసీపీ నిరసన కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటిస్తారా.? మంత్రి లోకేష్ పై వైసీపీ నేతల ఆరోపణలకు అండగా నిలుస్తారా అనేది చూడాలి.

ADVERTISEMENT

అలాగే ఇక దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ ని భవిష్యత్ లో రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు నారా లోకేష్ తండ్రి బాబు నాయత్వంలో పాఠాలు నేర్చుకుంటున్నారు, తన రాజకీయ విధానాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ నిరంకుశత్వాన్ని ఎదురించి యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టి తనను తానూ ఒక నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఇక ఓడిన చోటే తిరిగి నిలబడి 90 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు.

ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న లోకేష్ నిత్యం అటు విద్యార్థులతో ఇటు యువతతో మమేకమవుతూ వారికీ రాజకీయంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ నిర్వహిస్తున్న శాఖలు కూడా ముఖ్యంగా యువత టార్గెట్ గా ఉండడం జెన్ జీ ల ఆకర్షణకు లోకేష్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది.

అలాగే అటు తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే కాంగ్రెస్ తన సాంప్రదాయ రాజకీయ విధానాలైన సీనియారిటీ కి పట్టం కట్టే ఆలోచనలను పక్కన పెట్టి యువత దృష్టిని ఆకర్షించిన యువనాయకుడు రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. రేవంత్ దూకుడైన విమర్శలు, ప్రత్యర్థుల టార్గెట్ గా వదిలే పదునైన రాజకీయ బాణాలు రేవంత్ రెడ్డి ని తెలంగాణ యువతకు చేరువ చేసాయి.

ఇక తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ సైతం బిఆర్ఎస్ పాలనలో ఐటీ మంత్రిగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా నిలబడేందుకు, తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి అర్హత సాధించేందుకు కేటీఆర్ కి జెన్ జీల మద్దతు తప్పనిసరి.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా సినీ పరిశ్రమలో యువత అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ఎంట్రీతో యువత టార్గెట్ గానే ముందుకెళ్లారు. పవన్ ప్రసంగాలు, ప్రకటనలు కూడా యువత టార్గెట్ గా సాగుతుంటాయి.

ఇక రాజకీయ పార్టీల అధినేతల అందరిలో ఈ జెన్ జీ ల ఆకర్షణకు తొలి అడుగు వేసిన నేత కూడా పవన్ కల్యాణే కావడం విశేషం. తనకున్న సినీ గ్లామర్ ని పాలిటిక్స్ కూడా జత చేసి నేటి తరం బంగారు భవిష్యత్ కోసమే నా ఈ రాజకీయం అంటూ ముందుకెళ్తున్నారు పవన్.

అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం, పదవుల కోసం కాదు ప్రజల భవిష్యత్ కోసం అంటూ ముందుకెళుతున్న పవన్ జెన్ జీల లీడర్ గా ఎదగలరా.? తండ్రి కున్న విజనరీ నేత అనే మహావృక్షం కింద లోకేష్ తనదైన గుర్తింపు సాదించగలరా.?

తెలంగాణ జాతిపితగా ప్రచారం చేసుకునే కేసీఆర్ ని మరిపించే రాజకీయంతో కేటీఆర్ ముందుకు రాగలరా.? తండ్రి రాజశేఖర్ రెడ్డి రాజకీయ ఛరిష్మా తో జగన్ మరో ఛాన్స్ పొందగలరా.? తనదైన రాజకీయంతో రేవంత్ యువత మనసు గెలవగలరా.? ఈ ఐదుగురు యువ నాయకులలో జీన్ జీల మనసు గెలిచే ఆ లీడర్ ఎవరు.?

ADVERTISEMENT
Latest Stories