నాడు రైతు ఉద్యమం – నేడు జెన్ జీ ఉద్యమం (సీజేపీ) …హౌ టూ డీల్ బీజేపీ.?

Gen Z protest raises pressure on BJP

పుష్కరకాల అధికారంలో బీజేపీ రాజకీయంగా రెండు సార్లు ఊహించని ఎదురుదెబ్బలు తింది. మూడోసారి దేశంలో బీజేపీ ని అధికారంలోకి తెచ్చిన మోడీ ఛరిష్మా ఈ రెండు అంశాల విషయంలో కాస్త మసగ బారిందనే చెప్పాలి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత హ్యాట్రిక్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోడీ ఆ రెండు ఉద్యమాల విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అవే నాడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు, నేడు నీట్ పరీక్షా పాత్రల లీకేజ్ ఆరోపణలు. నాడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచనలంగా సృష్టించింది. దానితో బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. రైతు చట్టాల విషయంలో పునరాలోచన చేపట్టింది.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు అదే తరహాలో సోషల్ మీడియా వేదికగా జెన్ జీ (సీజేపీ) ఉద్యయం కొత్త చర్చకు తెరతీసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ తో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు పార్లమెంట్ ముట్టడి వరకు చేరింది. ఢిల్లీ వీధులు ఉద్యమకారుల నిరసన జ్వాలాతో పోలీస్ అధికారుల లాఠీ దెబ్బలతో ఉడుకుతుంది.

అయితే ఈ ఉద్యమాన్ని మోడీ సర్కార్ రాజకీయ కోణంలో కాకుండా యువత భావోద్వేగాలకు ప్రతిబింబం గా చూడాలనే అభిప్రాయం నానాటికి బలపడుతుంది. నాటి రైతు ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ మొదట కఠిన వైఖరి అవలంభించినప్పటికీ పోను పోను రైతుల దీర్ఘకాల నిరశన, ప్రజాభిప్రాయం, రాజకీయ ఒత్తిడ్ల నేపథ్యంలో చివరకి వ్యవసాయ చట్టాలను వెనక్కి తెసుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది.

ఆ అనుభవం ఒక విషయం స్పష్టంగా చెప్పింది. ప్రజలు ఆనోదోళనలను కేవలం ప్రతిపక్ష కుట్ర గా కొట్టిపారేయడం ఎల్లప్పుడూ ప్రభుత్వ విజయం కాదని, అది సమస్యకు పరిష్కారం అవధని నిరూపించింది. ప్రస్తుతం సీజేపీ ఉద్యమం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే తరహా సవాల్ ఎదురవుంటుంది.

కొందరు ఈ ఉద్యమాన్ని దేశ వ్యతిరేక ప్రచారంగా అభివర్ణిస్తుంటే మరికొందరు ఇది యువతలో పెరుగుతున్న నిరాశ, అసంతృప్తి, ఉద్యోగాలు, పరీక్షా నిర్వహణ, పాలన పై ఉన్న అసంతృప్తికి సంకేతామంటున్నారు. ఈ అంశం పై రాజకీయ పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రధానంగా మూడు అంశాల పై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

. యువత ఆందోళనలను శత్రుత్వంగా కూండా వైన్ ప్రయత్నం చెయ్యాలి.

. వివాదాస్పద అంశాల పై పట్టుదలకు పోకుండా పారదర్శకతతో స్పందించి సమస్యల పరిష్కార మార్గాలు చూపాలి.

. సోషల్ మీడియా విమర్శలను కేవలం అణిచివేయడం కంటే ప్రజలతో, నిరశనకారులతో ప్రత్యక్ష చర్చలకు అవకాశం కల్పించాలి.

ప్రతి ఉద్యమం సరైనదని ఎలా చెప్పలేమో అలాగే ప్రతి నిరశన వెనుక కుట్రే ఉందనే ఆలోచన కూడా ప్రభుత్వాలు చెయ్యకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విమర్శలను వినడం ఎంత ముఖ్యమో ఉద్యమాలకు చట్ట బద్దమైన పరిమితులు పాటించడం కూడా అంతే ముఖ్యం.

నాడు రైతు ఉద్యమం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునరాలోచింపచేసింది. నేడు జెన్ జీ సీజేపీ ఉద్యమం యువత మనోభావాలను అర్ధం, చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ సవాల్ ని బీజేపీ ఘర్షణతో కాకుండా చర్చలతో ఎదుర్కుంటేనే రాజకీయంగా ప్రజాస్వామ్య పరంగా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories